హైదరాబాద్: చెరువులను కాపాడాలనే ఉద్దేశంతో మొదట్లో తాము చాలా దూకుడుగా వ్యవహరించామని హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ (AV Ranganath) తెలిపారు. హైడ్రా ఏర్పాటు చేసి నేటికి ఏడాది పూర్తి అయిందని అన్నారు. అంబర్ పేట బతుకమ్మకుంట దగ్గర హైడ్రా ప్రథమ వార్షికోత్సవం జరిగింది. ఈ వార్షికోత్సవంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..దూకుడుగా వ్యవహరించడంతో చెరువుల ఆక్రమణలు (Pond encroachments) తగ్గాయని, భావితరాలకు భవిష్యత్ ఇవ్వడానికే హైడ్రా ఉందని తెలియజేశారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సామాజిక కోణంలో పేదల ఇళ్లు కూల్చడం లేదని చెప్పారు. కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 21న బతుకమ్మ కుంటను సిఎం ప్రారంభించనున్నారు. హైడ్రా అంటే డిమాలిషన్ డెవలప్ మెంట్ అని ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన బతుకమ్మకుంట శాంపిల్ మాత్రమే అని అన్నారు. త్వరలో ఎన్నో బతుకమ్మ కుంటలు వెలుగులోకి వస్తాయని రంగనాథ్ పేర్కొన్నారు.
దూకుడుగా వ్యవహరించడంతోనే చెరువుల ఆక్రమణలు తగ్గాయి: రంగనాథ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -