Sunday, August 31, 2025

రాష్ట్రానికి అనేక కొత్త రైళ్లు మంజూరు : కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్రం ఎన్నిసార్లు అడిగినా గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్ మినహా ఇతర పట్టణాల్లో విమానాశ్రయాలు లేవని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ లో విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని విమర్శించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని త్వర త్వరగా పూర్తి చేస్తోందని, కాజీపేట యూనిట్ ను కోచ్ వ్యాగన్లు (Coach wagons Kazipet unit) నుంచి ఇంజిన్ల తయారీ వరకు విస్తరిస్తున్నాం అని కిషన్ రెడ్డి తెలియజేశారు.

బడ్జెట్ కూడా రూ. 200 కోట్లతో ప్రారంభమై మరో రూ. 200 కోట్లు పెరిగిందని కాజీపేట రైల్వే పరిశ్రమతో దాదాపు 3 వేల ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రానికి అనేక కొత్త రైళ్లు మంజూరు అవుతున్నాయని అన్నారు. జోధ్ పుర్, కచ్, అహ్మదాబాద్ కు నేరుగా రైళ్లు సర్వీసులు వస్తాయని పేర్కొన్నారు. ఎంఎంటిఎస్ ను యాదగిరిగుట్ట వరకు విస్తరించాలని నిర్ణయించామని, యాదగిరిగుట్ట వరకు ఎంఎంటిఎస్ విస్తరణకు టెండర్లు పూర్తయ్యాయని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు వచ్చే ఏడాది పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News