Saturday, July 19, 2025

ఉప్పల్ నోటిఫైడ్ ఇండస్ట్రియల్ మున్సిపల్ సర్వీస్ సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

19న నామినేషన్ పత్రాలు జారీ
ఆగస్టు 11న ఎన్నికలు, అదేరోజు ఫలితాలు
పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి
సభ్యులందరికీ ఓటు హక్కు కల్పించాలి
ఏకపక్షంగా నిర్వహణకు కుట్రలు
పారిశ్రామికవేత్తలు ఆరోపణ
మన తెలంగాణ/ఉప్పల్: ఉప్పల్ నోటిఫైడ్ ఇండస్ట్రియల్ మున్సిపల్ సర్వీస్ సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్ ను ( Uppal Notified Industrial Municipal Service Society Election Notification Released) ఎట్టకేలకు ఐలా అధికారులు విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా 19న నామినేషన్ పత్రాలు జారీ, ఆగస్టు 11వ తేదీన ఎన్నికలు, అదేరోజు ఫలితాలు వెల్లడవుతాయి. 13 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత నిర్వహించనున్న ఈ ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలని సభ్యులైన పారిశ్రామికవేత్తలు కొందరు డిమాండ్ చేస్తున్నారు.

సభ్యులందరికీ ఓటు హక్కు కల్పించాలని పేర్కొన్నారు. న్నికల్లో పాల్గొనడానికి ఉప్పల్ నోటిఫైడ్, ఇండస్ట్రియల్ మునిసిపల్ ఏరియా సర్వీస్ సొసైటీకి ( Uppal Notified Industrial Municipal Service Society Election Notification Released) సభ్యత్వ రుసుము కోసం బకాయిలను చెల్లించడానికి వెళితే స్వీకరించడం లేదని కొందరు పారిశ్రామికవేత్తలు ఆరోపించారు. ఒక వర్గం కు సంబంధించిన వారి సభ్యత్వ రుసుమును మాత్రమే స్వీకరించడం అనుమానాలు కలిగిస్తున్నాయని విమర్శించారు.

ఇలా ఎన్నికల అధికారి లేదా ప్రస్తుతం అసోసియేషన్ నిర్వహిస్తున్న యునిమాస్ సిబ్బందితో సభ్యత్వ ఫీజు బకాయిల జాబితా అందుబాటులో లేదన్నారు. రుసుం స్వీకరించడానికి బాధ్యతగల వ్యక్తిని కార్యాలయంలో అందుబాటులో పెట్టాలని కోరారు. ఒక వర్గం కు సంబంధించిన కొందరు ఓటు హక్కును అందరికీ కల్పించకుండా కుట్రలు పన్నుతూ ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా పారదర్శకంగా సర్వీస్ సొసైటీ ( Uppal Notified Industrial Municipal Service Society Election Notification Released) ఎన్నికలను నిర్వహిస్తామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని ఐలా కమిషనర్ ప్రభాకర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News