Friday, July 18, 2025

‘విశ్వంభర’ కథ ఇదే.. క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన దర్శకుడు

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. వశిస్ఠ (Director Vassishta) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘రామా రామా’ అంటూ సాగే ఓ పాట కూడా విడుదల చేశారు చిత్ర యూనిట్. అయితే టీజర్ చూసిన ప్రేక్షకులు సినిమా కథను రకరకాలుగా అంచనా వేశారు. కొందరు ఇదే విశ్వంభర కథ అని ప్రచారం కూడా చేశారు. అయితే ఇలాంటి పుకార్లకు దర్శకుడు వశిష్ఠ ఫుల్‌స్టాప్ పెట్టారు. సినిమా కథ గురించి ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమాలో 14 లోకాలు చూపించనున్నట్లు వశిష్ఠ (Director Vassishta) పేర్కొన్నారు. ‘‘మనకు మొత్తం 14 లోకాలు ఉన్నాయి. పైలోకాలు ఏడు, కింది లోకాలు ఏడు. ఇప్పటివరకూ ఎవరికి తోచిన విధంగా వాళ్లు యవలోకం, స్వర్గలోకం, పాతాల లోకాన్ని చూపించారు. విశ్వంభరలో వీటన్నిటినీ దాటి పైకి వెళ్లా. అదే బ్రహ్మదేవుడి సత్య లోకం. ఈ 14 లోకాలకు అదే ఆధారం. హీరో ఆ లోకానికి డైరెక్ట్‌గా ఎలా వెళ్లాడు.? హీరోయిన్‌ను ఎలా తెచ్చుకున్నాడు.?’’ అనేది ఈ సినిమా కథ అని వశిష్ఠ వివరించారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఈ సినిమాలో త్రిష, అషిక హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. వీరిద్దరితో పాటు నాగిని సీరియల్ ఫేమ్ మౌనీరాయ్ ఈ సినిమాలో స్పెషల్ పాటలో చిరుతో కలిసి చిందులు వేస్తుందని టాక్ వినిపిస్తోంది. చిరంజీవి ‘ఖైదీ’ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ ‘రగులుతోంది మొగలిపోద’ పాటను ఈ సినిమాలో రీమేక్‌ చేసి ఆ పాటపై మౌనీరాయ్, మెగాస్టార్‌ డ్యాన్స్‌ చేయనున్నాట్లు టాక్. ప్రపంచంలోనే టాప్ విఎఫ్ఎక్స్ సంస్థలు ఈ చిత్రం కోసం పని చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ చూడని పాత్రలో చిరంజీవి ఈ సినిమాలో కనిపించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News