Saturday, July 19, 2025

ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ కు ఎంపికైన నాగోల్ డివిజన్ విద్యార్థి

- Advertisement -
- Advertisement -

12 ఏళ్ల నితీష్ కుమార్ అనే అబ్బాయి స్పీడ్ క్యూబ్ కాంపిటీషన్లో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. అతి పిన్న వయస్సులో అంటే 7 సంవత్సరాల నుండే తల్లి దండ్రుల ప్రోత్సాహంతో యూ ట్యూబ్ చూసి స్పీడ్ క్యూబ్ నేర్చుకొన్నాడు. గతంలో నితీష్ గ్రాండ్ స్పీడ్ క్యూబ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ వారు నిర్వహించిన ఆన్లైన్ టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇవే కాకుండా పలు టోర్నమెంట్ లలో పాల్గొని 16 ప్రశంసా పత్రాలు, 9 ట్రోఫీలు, 3 షిల్డ్స్, 2 బంగారు పతకాలు సాధించాడు.

2024-25 సంవత్సరానికి గాని మన తెలంగాణ రాష్ట్రం నుండి భారత రాష్ట్రపతి పురస్కారనికి కూడా నామినేట్ అయ్యాడు. కానీ తృటిలో అవకాశం చెజారి పోయింది. అయినా పట్టు వదలకుండా ఈ సంవత్సరం మరిన్ని టోర్నమెంట్స్ లో పాల్గొని ఇంకా పతకాలు సాధించాడు. ఇప్పుడు ఈ ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. నితీష్ ప్రస్తుతం దిల్ షుక్ నగర్ పబ్లిక్ స్కూల్ లో 7వ తరగతి చదువుతున్నాడు. నితీష్ తల్లి దండ్రులు అనూషా – గిరీష్ కుమార్ లు తమ కుమారుడు సాదించిన విజయానికి వాళ్ల ఆనంధాని అవధులు లేకుండా పోయాయి. భవిష్యత్ లో ఈ చిన్నారి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News