Saturday, July 19, 2025

హైదరాబాద్‌లో భారీ వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నగరం (Hyderabad) మొత్తం మేఘావృత్తం అయింది. కాసేపటికే భారీ వాన కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్ని జలమయం అయ్యాయి. ఫలితంగా రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.

ఉప్పల్‌లో రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉప్పల్ స్టేడియం (Hyderabad) నుంచి హబ్సిగూడ వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మ్యాన్‌హోల్స్ తెరుచుకున్నాయి. కాగా, జిహెచ్‌ఎంసి పరిథిలో రాత్రి వరకూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భాగ్యనగర వాసులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News