రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలుకా’. ఈ సినిమాకు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘నువ్వుంటే చాలే’ అంటూ సాగే ఈ పాటను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంది. తొలిసారిగా రామ్ ఈ పాటకి లిరిక్స్ రాశాడు. వివేక్ మరియు మెర్విన్ సంగీతం అందించిన ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పాడాడు. ప్రస్తుతం ఈ పాట రామ్ అభిమానులనే కాదు.. కామన్ ఆడియన్స్‌ని కూడా అలరిస్తోంది.
ఇక సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో ఉపేంద్ర ‘అంధ్ర కింగ్’ పాత్ర పోషిస్తున్నారు. రామ్ (Ram Pothineni) ఈ సినిమాలో ఉపేంద్ర ఫ్యాన్‌గా కనిపించనున్నాడు. మహేశ్ బాబు.పి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేనీ, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.