సినిమా చిన్నదా, పెద్దదా అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే దాన్ని హిట్ చేస్తారు ప్రేక్షకులు. అలా ఓ చిన్న సినిమా ఈ ఏఢాది టాప్ హిట్‌గా నిలిచిన ‘ఛావా’ సినిమాను దాటేసింది. ఆ సినిమానే ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (Tourist Family). ఎం.శశికుమార్, సిమ్రన్, మిథున్ జై శంకర్, కమలేశ్ జగన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏకంగా 1200 శాతం అధిక లాభాలను సాధించింది. కేవలం ఏడు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఏకంగా రూ.90 కోట్ల వసూళ్లు రాబట్టింది.
అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించిన టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family) ఈ ఏడాది ఏప్రిల్ 29న విడుదలై విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. మొదటి వారం రూ.23 కోట్ల వసూళ్లు రాగా, రెండో వారం మౌత్ పబ్లిసిటీతో రూ.29 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఐదు వారాలు తిరిగే సరికి ఏకంగా రూ.90 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఛావా’. ‘ఛావా’ చిత్రం దాదాపు రూ.90 కోట్లతో రూపొంది.. 800 శాతం లాభాలతో రూ.800 కోట్లను రాబట్టింది. కానీ, ఇప్పుడు టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం ఛావాను వెనక్కి నెట్టి 1200 శాతం లాభాలతో నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది.