- Advertisement -
హైదరాబాద్: బేగంపేటలోని విమాన నగర్ లో హోండా షోరూంలోకి వరదనీరు భారీగా చేరింది. చిక్కుకున్న సిబ్బందిని ఎన్ డిఆర్ ఎఫ్ బృందాలు బయటకు తీసుకొచ్చాయి. భాగ్యనగరంలో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. భారీ వర్షంతో కొన్ని ప్రాంతాలలో వరద బీభత్సం సృష్టించింది. విమాన నగర్ లో హోండా షోరూమ్‌లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. హోండా షోరూమ్‌లో పనిచేస్తున్న సుమారు 80 మంది కార్మికులు రక్షించాలంటూ పోలీసు, డిఆర్‌ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్, హైడ్రా అధికారులకు షోరూమ్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. హైడ్రా, పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి షోరూమ్ వెనుకవైపు నుంచి కార్మికుల తరలించారు. కొందరిని బోట్ల ద్వారా పోలీస్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు.
- Advertisement -