- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లా చాపాడు మండలం పెద్ద చీపాడులో దారుణం జరిగింది. భార్యను భర్త హత్య చేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెద్ద చీపాడు గ్రామంలో గోపాల్, సుజాత దంపతులు నివసిస్తున్నారు. సుజాత మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో భార్య సుజాతను భర్త గోపాల్ హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని వనిపెంట అటవీ ప్రాంతంలో పడేశారు. రెండో రోజుల తరువాత పోలీస్ స్టేషన్ లో నిందితుడు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం కోసం పోలీసులు అడవిలో గాలిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -