Sunday, July 20, 2025

ఆద్యంతం ఆసక్తికరంగా ట్రైలర్

- Advertisement -
- Advertisement -

వర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా ‘సార్ మేడమ్’. (Sir, Madam) పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘సార్ మేడమ్’ టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. శుక్రవారం మేకర్స్ ‘సార్ మేడమ్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. “నాతో వస్తే లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించకుండా నేనే కావాలని వచ్చేశావు. మా అమ్మానాన్నే నన్ను ఇలా చూసుకోలేదని వాళ్ళే తిట్టుకునే విధంగా నిన్ను చూసుకుంటా’ అని విజయ్ సేతుపతి డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

విజయ్ సేతుపతి, నిత్యామీనన్ మధ్య వచ్చే గొడవలు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. పెళ్లి చూపులు, పెళ్లి లాంటి బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో (Beautiful emotions) మొదలైన ట్రైలర్ ‘మమ్మల్నిద్దర్నీ విడదీసేయండి’ అని నిత్యామీనన్ చెప్పిన డైలాగ్‌తో ఊహించని మలుపు తీసుకోవడం ఆసక్తికరంగా ఉంది. పరోటా మాస్టర్‌గా విజయ్ సేతుపతి కనిపించిన సీన్స్ నవ్వులు పూయించాయి. విజయ్ సేతుపతి మరోసారి తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. డైరెక్టర్ పాండిరాజ్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అందించారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమా జూలై 25న థియేటర్లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News