Sunday, July 20, 2025

మరో పదేళ్లు నేనే సిఎం అన్న రేవంత్… సంచలన వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాబోయే పదేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని ఎంఎల్ఎ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని తెలియజేశారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని హెచ్చరించారు.

పాలమూరు బిడ్డ నైన తాను ఈ మట్టిలో పుట్టి ముఖ్యమంత్రి అయితే కెసిఆర్ కుటుంబం ఓర్వలేకపోతోంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2034 వరకు నేనే సిఎంగా ఉంటా. పాలమూరు నుంచే పాలన సాగిస్తానని రేవంత్ ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. దీనిని డైరీలో రాసుకో..నీ గుండెల మీద రాసుకో అని కెసిఆర్‌ను ఉద్దేశించి సిఎం ఘాటు విమర్శలు చేసిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News