సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ (paradha)అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ యత్ర నార్యస్తు అనే పాటను కూడా లాంచ్ చేశారు. ‘పరదా’ సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ డేట్, సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్‌కి హీరో సత్యదేవ్, నిర్మాత డి.సురేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ చాలా ప్రేమతో చేసిన సినిమా ఇదని అన్నారు. డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల మాట్లాడుతూ “ఈ సినిమాలో పాటలన్నీ మనసుకి (songs mind) హత్తుకుంటాయి. సినిమా బండి, శుభం తర్వాత ఈ సినిమా నాకు చాలా పెద్ద ఫిల్మ్. మాకు ఇది బాహుబలి లాంటి సినిమా”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు విజయ్, శ్రీధర్, చిత్ర బృందం పాల్గొంది.