Sunday, July 20, 2025

కెటిఆర్… నీ జీవితంలో సిఎం కాలేవు: హనుమంతరావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కెటిఆర్ తో ఎన్నో కుటుంబాలు ఆగమయ్యాయని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ తో భార్యాభర్తల మాటలు కూడా విన్నావని,  ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల జీవితాలు నాశనం చేశావని ధ్వజమెత్తారు. కెటిఆర్, హరీష్ రావును సిఎం రేవంత్ ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ భూములు అమ్ముకున్నది కెటిఆర్ కాదా? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ పాలనలో షాడో సిఎంగా వ్యవహరించావని, కానీ జీవితంలో నువ్వు సిఎం కాలేవని మండిపడ్డారు. ఎపి, తెలంగాణ లొల్లి పెట్టాలని చూస్తున్నావని, కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే డైరెక్ట్ గా ఎటాక్ చేస్తామని మైనంపల్లి హెచ్చరించారు. కెటిఆర్ కు సిరిసిల్ల ప్రజలు  బుద్ధిచెప్పే రోజులు వస్తాయని, ఇష్టానుసారం మాట్లాడుతానట్టే ఊరుకోమన్నారు. కెటిఆర్ అరాచకాలపై పుస్తకం రాసి గడపగడపకూ పంచుతామని, అతి త్వరలో జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయమని మైనంపల్లి జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News