Sunday, July 20, 2025

వారం, పది రోజుల్లోనే పరిష్కారం చూపిస్తాం: రంగనాథ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణ, వరద నీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలపై దృష్టి పెట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) తెలిపారు. ఇవాళ్టితో హైడ్రా ఏడాది పూర్తిచేసుకుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిలోనే 30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని రక్షించిందని, 500 ఎకరాల భూములను అక్రమార్కుల చెర నుంచి విడిపించిందని తెలియజేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని, వారం, పది రోజుల్లోనే పరిష్కారం చూపిస్తామని చెప్పారు. పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News