మేషం: మేష రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సంతానానికి చదువు విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. గత కొంతకాలంగా ఉద్యోగ పరంగా మంచి స్థాయి స్థానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది. విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్న వారికి వీసా లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్టేఫలి అన్నట్టుగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రతి విషయంలో అంటే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సంతానపరంగా కుటుంబ పరంగా కూడా స్థిరమైన ఖచ్చితమైన నిర్ణయం తీసుకోండి. ధన పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. స్కిన్ ఎలర్జీలు మోకాళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా మొగలి పువ్వు కుంకుమతో అమ్మవారిని ఆరాధించండి. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు చదవండి లేదా వినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో.
వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా ఆరోగ్య పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. వ్యాపార అభివృద్ధి బాగుంది. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. సొంత విషయాలలో మిత్రుల జోక్యానికి స్థానం కల్పించకండి. కీలకమైన విషయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. కెరియర్ పైన వ్యాపారం మీద ఎక్కువగా దృష్టి పెడతారు. దైవానుగ్రహం బాగుంది వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకోండి.మీ తెలివితేటలతో నలుగురిని ఆకట్టుకుంటారు. నూతన గృహం కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తారు. ఉద్యోగ పరంగా స్థిరత్వం బాగుంటుంది. బ్యాంకు లోన్లకు క్రెడిట్ కార్డులకు అప్పులకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా అమ్మవారికి మొగిలి పువ్వు కుంకుమతో లేదా ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చేసి ఓం నమో నారాయణ భక్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ.
మిథునం: మిధున రాశి వారికి ఈ వారం రం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గత కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ వారం ఉపశమనం లభిస్తుంది. జన్మరాశిలో గురువు బలంగా ఉన్నారు. ఈ వారం ఫలితాలు కూడా బాగుంటాయి. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి కాలమనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగుంటాయి. నిత్యవసర సరుకులు అమ్మే వారికి హోటల్ వ్యాపారస్తులకు చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి లాభాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా లాభాల బాటలో ఉంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో నువ్వుల నూనె కలిపి దీపారాధన చేయండి. నర దిష్టి అధికంగా ఉంటుంది కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఇది రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 4 కలిసివచ్చే రంగు లైట్ గ్రీన్.
కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చెప్పుకో తగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఏర్పడవు. నిరుద్యోగులైన విద్యావంతులకు మీ ప్రయత్నానికి తగిన ఉద్యోగం లభిస్తుంది. కెరియర్ మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. లోన్ యాప్లకు దూరంగా ఉండండి. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. సుబ్రహ్మణ్య పాశుపత కంకణం కానీ రూపు కాని ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు మెరూన్.
సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. ఋణాలు తీరుస్తారు. కెరియర్ పరంగా మరియు వ్యాపార పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆరోగ్య పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నప్పటికి అవి తొలగిపోతాయి. నూతన గృహం కానీ ప్లాటు కానీ కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుండో వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణము ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా వినండి లేదా చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్య: కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రభుత్వ పరంగా రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. వ్యాపార పరంగా కెరియర్ పరంగా కాలం అనుకూలంగా ఉంది.ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిదికాదు. నిరుద్యోగులు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్ధిక విషయంలో లోటుపాట్లు ఉంటాయి. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. హనుమాన్ వత్తులతో నువ్వుల నూనెతో ప్రతిరోజు దీపారాధన చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. ఇంద్రాణి రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు తెలుపు.
తుల: తులారాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా అభివృద్ధి కూడా బాగుంటుంది.స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. బిజినెస్ లోన్ మంజూరు అవుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. స్నేహితుల నుండి ఊహించని సహాయం అందుతుంది. విదేశాలు వెళ్లాలనుకునే వారికి కాలం కలిసి వస్తుంది. నూతన వ్యాపారాల్లో మరింత పురోగతి సాధిస్తారు. ఇంటా బయట మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. గో సేవ, అన్నదానం చేయండి. ప్రతిరోజు ఓం నమో నారాయణ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంక ఏడూ కలిసివచ్చే రంగు బ్లూ.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. కొంత మంది విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి కొన్ని కార్యక్రమాలు చేపడతారు కానీ ఆ ప్రయత్నాలు వికటిస్తాయి. ఉద్యోగ పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. మీపై కొన్ని నిందలు ప్రచారంలో ఉంటాయి. హెచ్ వన్ బి వీసా, పి ఆర్ లభించే అవకాశం గోచరిస్తుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం మరియు ఓం నమో నారాయణ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం అనేది చెప్పదగిన సూచన. విష్ణు ఆలయ దర్శనం చేసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు పర్పుల్.
ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారం యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఈ వారం ముందుకు సాగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఏమీ ఉండవు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి తొలగిపోతాయి. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ అందుతాయి. అంతా మంచి అభివృద్ధిలోకి వస్తారు. చేతి వరకు వచ్చిన కొన్ని బాధ్యతలు చేజారి పోతాయి. ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కష్టపడే మీ తత్వం అందరికీ నచ్చుతుంది. దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. ఏదైనా ఒక మంగళవారం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.
మకరం: మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలకు విషయంలో జాగ్రత్తలు అవసరం. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. అవసరానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కీలక విషయాలలో ద్విస్వభావ ఆలోచనలు చెయ్యడం మంచిది కాదు. అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మవారిని కుబేర కుంకుమతో లక్ష్మీ అష్టోత్తరంతో పూజించండి. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసివచ్చే రంగు మెరున్.
కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య పరంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం అనేది సర్వసాధారణం అయిపోతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కొంతమంది అహంకారపూరితమైన వ్యవహార శైలిని మార్చుకోవాలి, దీనివలన ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేకపోలేదు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. ఇటువంటి లోటు ఉండదు. అయితే ఖర్చు ఉంటుంది. కోర్టుపరమైన వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకు కొన్ని విషయాలలో నిరాశ పెరుగుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. సాధ్యమైనంతవరకు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుబేర కుంకుమలతో అమ్మవారిని పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్.
మీనం: మీన రాశి వారికి ఈ వారం గడిచిన నాలుగు వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి. వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. సంతాన పరంగా కూడా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. నలుగురి సలహాల కంటే కూడా మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాల వల్లనే మీకు ఎక్కువ లాభం చేకూరుతుంది. ఇంటా బయట అదనపు బాధ్యతల వలన చికాకు పెరుగుతుంది. మానసిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. దైవదర్శనాలు విహారయాత్రలు చేస్తారు. వివాహ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు స్కై బ్లూ