Monday, July 21, 2025

మేడారం గురుకుల నుండి విద్యార్థి పరార్

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి జిల్లా, నందిమేడారం బాలుర గురుకుల విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ధర్మపురి గ్రామానికి చెందిన ఇమ్మడి మెగావర్షిత్ శనివారం తెల్లవారుజామున విద్యాలయం నుండి పారిపోయాడు. అయితే, నాటకీయ పరిణామాల మధ్య సాయంత్రం మళ్లీ విద్యాలయానికి చేరుకోవడంతో ప్రిన్సిపాల్‌తోపాటు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంవత్సరమే విద్యాలయంలో చేరిన వర్షిత్ తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో విద్యాలయం ప్రధాన గేటు ఎక్కి పారిపోయినట్లు సిసి కెమెరాలో రికార్డు అయిందని ప్రిన్సిపాల్ విద్యాసాగర్ తెలిపారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించడంతోపాటు పోలీసులకు తెలిపారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నందున మరిన్ని పకడ్బందీ జాగ్రత్తలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News