Monday, July 21, 2025

ఎంపి రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్

- Advertisement -
- Advertisement -

మెదక్ ఎంపి రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శనివారం తనకు బెదిరింపు కాల్ వచ్చినట్లు ఎంపి తెలిపారు. సాయంత్రంలోగా నిన్ను చంపుతాం, నీ అంతు చూస్తాం అంటూ మధ్యప్రదేశ్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు రఘునందన్ పేర్కొన్నారు. కాగా ఆయనకు ఇప్పటికే రెండు సార్లు బెదిరింపు ఫోన్ వచ్చింది. ఆపరేషన్ కగార్ ఆపాలని, హైదరాబాద్‌లో మా ముఠా ఉందని, దమ్ముంటే కాపాడుకో అంటూ రెండు నెంబర్ల నుంచి గతంలో బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత నెల రోజుల వ్యవధిలో రెండు ఫోన్ కాల్స్ రాగా తాజాగా మూడోసారి బెదిరింపు కాల్ వచ్చింది. గతంలో వచ్చిన బెదిరింపు కాల్స్ నేపథ్యంలో ఎంపి రఘునందన్ రావు డిజిపి, ఆయన పార్లమెంట్ పరిధిలోని జిల్లాల ఎస్పిలకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు విచారణ అనంతరం రఘునందన్ రావుకు భద్రత పెంచుతూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News