‘మీ అరాచకాలపై పుస్తకం రాస్తా…ప్రజలకు పంచుతా’ అని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు బిఆర్‌ఎస్ నాయకులనుద్ధేశించి అన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఈ అరాచకాల గురించి చెబితే ఓ పుస్తకం అవుతుందని, అందుకే తాను ఓ పుస్తకం రాసి ఇంటింటికీ పంచి పెడతానని ఆయన తెలిపారు. పేదలకు డబుల్ బెడ్ రూంలు ఇస్తామంటూ కాలాయాపన చేశారని ఆయన విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో తొమ్మిది వేల కోట్ల రూపాయలు విడుదల చేశారని ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌తో సినీ నటుల ఇళ్ళలోనూ గొడవలు సృష్టించారని ఆయన తెలిపారు. మీరు ఫామ్ హౌస్ ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు ఓ సినీ నటి చెప్పారని ఆయన తెలిపారు. తమను రెచ్చగొడితే తగ్గేదెలే అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని మైనంపల్లి మండిపడ్డారు.
మీ అరాచకాలపై పుస్తకం రాస్తా…పంచుతా:మైనంపల్లి
- Advertisement -
- Advertisement -
- Advertisement -