నైరుతి నైజర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు భారతీయులు మరణించగా, ఒకరు అపహరణకు గురయ్యారని ఇక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. ‘జూలై 15న నైజర్‌లోని డోసో ప్రాంతంలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిలో ఇద్దరు భారతీయులు విషాధకరంగా ప్రాణాలు కోల్పోగా, ఒకరు అపహరణకు గురయ్యారు’ అని భారత రాయబార కార్యాలయం శుక్రవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రాజధాని నియామీ నుండి 130 కిమీ. దూరంలో ఉన్న డొస్పోలో ఒక నిర్మాణ స్థలానికి కాపలాగా ఉన్న సైనిక యూనిట్‌పై గుర్తు తెలియని ముష్కరులు దాడి చేశారని స్థానిక మీడియా తెలిపింది. మరణించిన వారి మృతదేహాలను తిరిగి అప్పగించడానికి స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు ఇండియన్ మిషన్ తెలిపింది. అపహరణకు గురైన భారతీయుడిని రక్షించేందుకు కృషి చేస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది. ఇదిలావుండగా పశ్చిమ ఆఫ్రికా దేశంలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇండియన్ మిషన్ సూచించింది.
నైజర్‌లో ఇద్దరు భారతీయులను చంపేసిన ఉగ్రవాదులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -