Monday, July 21, 2025

బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్

- Advertisement -
- Advertisement -

బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ నిర్మించనుంది. టిబెట్‌లో ప్రవహించే బ్రహ్మపుత్రపై భారతదేశపు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఈ నిర్మాణానికి చైనా ఇప్పటికే పనులు చేపట్టింది. శనివారం ఈ పనులు ఆరంభించినట్లు చైనా ప్రధాని లి కియాంగ్ తెలిపారు. నేలను చదును చేసే పనులు ఆరంభించారు. బ్రహ్మపుత్రను చైనాలో మాండలికంగా యార్లాంగ్ జాంగ్బో అని పిలుస్తారు. న్యింగ్చీ సిటీకి సమీపంలో నది పల్లపు ప్రాంతంలో భౌగోళికంగా అనువైన ప్రాంతాన్ని ఎంచుకుని చైనా అత్యంత పెద్దదైన ఆనకట్టను నిర్మించడం పట్ల భారతదేశ స్పందన ఏ విధంగా ఉంటుందనేది కీలకం అయింది. డ్యాం నిర్మాణ పనులు అట్టహాసంగా ఆరంభమైన విషయాన్ని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. తమ దేశ జల విద్యుత్ ఉత్పాదక సామర్థం పెంచుకునేందుకు ఇటువంటి భారీ డ్యాంలు అవసరం అని చైనా అధికారికంగా ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News