Sunday, July 20, 2025

ఎస్‌ఎల్‌బిసి పనులు త్వరలో ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్‌ఎల్‌బిసి పునరుద్ధరణ చ ర్యలు చేపట్టనున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. సుమారు పది కిలో మీటర్ల దూరం సొ రంగమార్గం పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్రానికి జీవనాడిగా మారనున్న ఎస్‌ఎల్‌బిసి పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. జాతీయ భౌగోళిక పరిశోధనా సంస్థ (ఎన్.జి.ఆర్.ఐ)తో పాటు భా రత భూగర్భ సర్వే సంస్థ(జీ.ఎస్.ఐ)ల సహకారంతో పనులు త్వరలో చేపట్టనున్నట్లు తెలిపా రు. సొరంగం పనులలో అనుభవం ఉన్న మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ జనరల్ హర్బల్ సింగ్‌ను నీటిపారుదల శాఖకు గౌరవ సలహాదారుగా ని యమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వానకా లం పంటలకు సమృద్ధిగా నీటిని అందించేందు కు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక అటు వానాకాలం ఇటు యాసంగి పంటలకు ప్రణాళికా బద్దంగా సాగునీటిని అందించి అద్భుతమైన ఫలితాలు సాదించామని, వ్యవసాయశాఖ, నీటిపారుదల శాఖాధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే రాష్ట్రంలో 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు.

ప్రస్తుత వానాకాలం పంటలకు నీటి విడుదలపై రూట్ మ్యాప్ రూపొందించుకుని తక్షణమే అమలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సాగునీటి విడుదల విషయంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా, చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే ఎదురయ్యే పరిణామాలపై ముందస్తు బందోబస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. ప్రధాన అనకట్టలతో పాటు జలాశయాలు, కాలువలను అధికారులు క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా అధికారులు సన్నద్ధం కావాలన్నారు. వర్షా కాలంలో సంభవించే భారీ వర్షాలకు గండ్లు పడకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని సూచించారు. విపత్తులు సంభవిస్తే తక్షణమే నష్టానివారణ చర్యలకు అధికారులు అప్రమత్తంగా ఉండి పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని కోరారు.

భూముల పరిరక్షణ చర్యలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్యాక్రాంతం అవుతున్న నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణకు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తో పాటు ఇంజినీరింగ్ రీసెర్చ్ లాబొరేటరీ వంటి సంస్థలకు చెందిన భూముల ఆక్రమణకు గురయ్యాయని వాటిని తక్షణమే తొలగించాలన్నారు. స్పెషల్ డ్రైవ్ తో నీటిపారుదల శాఖ భూములన్నింటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. శాఖపరమైన అంశాలతో పాటు పెండింగ్ లో ఫించన్లు ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖ సలహాదారు అదిత్యా దాస్ నాధ్, ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News