- Advertisement -
న్యూఢిల్లీ: వియత్నాంలోని ప్రసిద్ధ హా లాంగ్ బేలో విషాదం చోటుచేసుకుంది. 53 మందితో ప్రయాణిస్తున్న పర్యాటక పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో చిన్నారులతో సహా 34 మంది మరణించారు. ఈ ఘటనలో పలువురు మంది గల్లంతయ్యారు. తుఫాను విఫా ప్రభావంతో బలమైన గాలులు, భారీ వర్షాలు ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి.
క్వాంగ్ నిన్హ్‌లోని ప్రాంతీయ అధికారుల ప్రకారం, ప్రసిద్ధ డౌ గో గుహ సమీపంలో స్థానిక సమయం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు వండర్ సీ క్రూయిజ్ పడవ బోల్తా పడింది. పడవలో 48 మంది పర్యాటకులు, 5 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో చాలా మంది పిల్లలతో ఉన్న కుటుంబాలు ఉన్నారు. ఇప్పటివరకు 11 నుండి 12 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరణించిన వారిలో ఎనిమిది మంది పిల్లలు మరణించినట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -