Sunday, July 20, 2025

షూటింగ్లో షారుఖ్ ఖాన్కు గాయాలు.. అమెరికాలో చికిత్స

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం కింగ్. ఈ మూవీ షూటింగ్
ముంబైలో జరుగుతోంది. ఈ క్రమంలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు షారుఖ్ ఖాన్ కండరాలకు గాయాలయ్యాయని వార్తలు వస్తున్నాయి. గోల్డెన్ టొబాకో స్టూడియోలో హై-ఆక్టేన్ స్టంట్ సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. అయితే గాయం ఎలా జరిగిందో ఖచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు.

నివేదికల ప్రకారం.. ఈ ఘటన తర్వాత షారుఖ్ కు గాయాలతోపాటు వెన్నునొప్పి రావడంతో వైద్యులను సంప్రదించారు. దీంతో నెల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. తర్వాత గాయాలకు చికిత్స కోసం షారుఖ్ ఖాన్ అమెరికాకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. షారుఖ్ పూర్తిగా కోలుకున్న తర్వాత సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

మరోవైపు, షారుఖ్ ఖాన్ కు గాయపడ్డారనే వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేస్తూ.. “నా సోదరుడు షారుఖ్ ఖాన్ షూటింగ్ సమయంలో కండరాల గాయాలకు గురైనట్లు వచ్చిన వార్తలు నన్ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News