Sunday, July 20, 2025

భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ రద్దు

- Advertisement -
- Advertisement -

బర్మింగ్‌హామ్: దయాది దేశాలు భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ రద్దు అయ్యింది. ఇంగ్లాండ్ వేదికగా మాజీ క్రికెటర్లతో ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(WCL) 2025 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ 20న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడాల్సి ఉండగా.. ఈ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు WCL ప్రకటించింది. ఈ మ్యాచ్ చూసేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున టికెట్స్ బుక్ చేసుకున్న ప్రేక్షకులకు తిరిగి వారి డబ్బులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

“WCLలో మేము ఎల్లప్పుడూ క్రికెట్‌ను ఎంతో ఆదరిస్తా.. ప్రేమిస్తా. అభిమానులకు కొన్ని మంచి, సంతోషకరమైన క్షణాలను అందించడమే మా ఏకైక లక్ష్యం. ఈ సంవత్సరం పాకిస్తాన్ హాకీ జట్టు భారత్ కు వస్తుందనే వార్త విన్న తర్వాత.. ఇటీవల భారత్ vs పాకిస్తాన్ వాలీబాల్ మ్యాచ్‌తో పాటు, రెండు దేశాల మధ్య వేర్వేరు క్రీడలలో జరిగిన కొన్ని ఇతర మ్యాచ్‌లను చూసిన తర్వాత, WCLలో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌ను కొనసాగించాలని మేము భావించాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు కొన్ని సంతోషకరమైన జ్ఞాపకాలను అందించాలనుకున్నాం. కానీ ఈ ప్రక్రియలో మేము చాలా మంది భావాలను గాయపరిచడం.. భావోద్వేగాలను రేకెత్తించి ఉండవచ్చు” అని టోర్ని నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. కాగా, పహల్గామ్ దాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఆడబోమని టీమిండియా మాజీ క్రికెటర్లు చెప్పడంతో ఈ మ్యాచ్ ను WCL రద్దు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News