Sunday, July 20, 2025

ఏది చేసినా పూర్తిగా చేయాలనిపిస్తుంది

- Advertisement -
- Advertisement -

పాత హీరోయిన్‌లు ఈమధ్య ఎక్కువగా గ్యాప్ తీసుకోవడం లేదు. పెళ్లి చేసుకున్నామా, బాబు లేదా పాపను కన్నామా, తిరిగి సినిమాల్లోకి వచ్చేశామా అన్నట్టుంది పరిస్థితి. అయితే దీనికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది జెనీలియా. కెరీర్‌లో ఆమె పదేళ్లకు పైగా గ్యాప్ తీసుకుంది. ఎట్టకేలకు ఈ మధ్యనే ‘సితారే జమీన్ పర్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. పనిలోపనిగా సౌత్‌లో కూడా ‘జూనియర్’ (Junior) అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చేసింది. తాజాగా తన గ్యాప్‌కు కారణాన్ని వెల్లడించింది జెనీలియా. ఈ గ్యాప్‌లో గృహిణిగా మాత్రమే కాదు, వ్యాపారవేత్తగా కూడా సక్సెస్ అయ్యానని వెల్లడించింది జెనీలియా.

పెళ్లి తర్వాత భర్తకు టైమ్ ఇవ్వాలి. ఆ తర్వాత పిల్లలకు టైమ్ కేటాయించాలి. అందుకే సినిమాలకు టైమ్ ఇవ్వలేకపోయాను. మిగతా హీరోయిన్‌లలా రెండూ బ్యాలెన్స్ చేయడం నాకు రాదు. ఏది చేసినా పూర్తిగా చేయాలనిపిస్తుంది. ఈ పదేళ్లలో నేను నిర్మాతగా మారాను. అంతేకాదు, వ్యాపారవేత్తను (producer, businessman) కూడా అయ్యాను. ఓ ఫుడ్ కంపెనీని సొంతంగా ప్రారంభించాను. ఇలా ఈ పదేళ్లలో చేసిన పనుల్ని 3 ముక్కల్లో తేల్చేసింది జెనీలియా. పిల్లలు పెద్దవ్వడంతో, ఇకపై సినిమాలకు ఫుల్ టైమ్ కేటాయిస్తానని చెబుతోంది. ‘జూనియర్’ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు మంచి స్పందన వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News