ఇంగ్లండ పర్యటనలో ఉన్న భారత పురుషుల జట్టు అతిథ్య జట్టుతో టెస్ట్ సిరీస్‌లో తలపడుతోంది. ఈ సిరీస్‌లో 2-1 తేడాతో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉంది. బుధవారం నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ విజయంతో సిరీస్‌ను సమం చేయాలని భారత్ భావిస్తోంది. ఇందుకోసం జట్టును మరింత పటిష్టంగా తయారు చేస్తోంది. అయితే నాలుగో టెస్ట్‌లో జట్టులో ఓ కీలక మార్పు చోటు చేసుకొనే అవకాశం ఉంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా బుమ్రాకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి ఇచ్చి.. అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకుంటారని వార్తలు వచ్చాయి.
అయితే ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అర్ష్‌దీప్ బౌలింగ్ చేసే చేతికి గాయమైందట. దీంతో అతను నాలుగో టెస్ట్ ఆడలేడు.. కాబట్టి అతని స్థానంలో దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన అన్షుల్ కాంబోజ్‌ను జట్టులోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది. భారత్ ఎ తరఫున ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అన్షుల్.. రెండు మ్యాచుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. అంతేకాక.. హాఫ్ సెంచరీ కూడా చేశాడు. దీంతో అతను జట్టులోకి వస్తే భారత్‌కు కలిసి వస్తుందని మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది. అయితే అర్ష్‌దీప్ లేని పక్షంలో అన్షుల్‌కి అంతర్జాతీయ అనుభవం లేకపోవడంతో బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడించి.. ఒక వేళ విజయం సాధిస్తే.. ఐదో టెస్ట్‌లో విశ్రాంతి ఇద్దామని మేనేజ్‌మెంట్ అనుకుంటోంది.