Sunday, August 31, 2025

రెచ్చిపోయిన కన్వర్ యాత్రకులు.. సిఆర్‌పిఎఫ్ జవానుపై దాడి

- Advertisement -
- Advertisement -

మీర్జాపూర్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్ రైల్వే స్టేషన్‌లో కన్వర్ యాత్రికులు (Kanwar Tourists) రెచ్చిపోయారు. ఓ సిఆర్‌పిఎఫ్ జవానుపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. శనివారం ఈ ఘటన జరిగింది. సిఆర్‌ఫిఎఫ్‌కి చెందిన గౌతమ్ అనే జవాను బ్రహ్మపుత్ర మొయిల్ కోసం ఎదురుచూస్తున్నాడు. అదే సమయంలో అక్కడ ఉన్న కొందరు కన్వర్ యాత్రికులతో టికెట్ విషయంలో గొడవ జరిగింది. మాటామాట పెరగడంతో కన్వర్ యాత్రికులు సదరు జవానును చితకబాదారు. నేల మీద పడిన అతనిపై పిడిగుద్దులు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. ఈ దాడికి పాల్పడిన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్ చమన్ సింగ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News