Sunday, August 31, 2025

బాలీవుడ్ షాన్ డాన్ దర్శకులు చంద్ర కన్నుమూత

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ దిగ్గజ దర్శకులు చంద్ర బారోట్ కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. పలు ఇతర సినిమాలతో పేరొందినప్పటికీ ఆయన అమితాబ్ బచ్చన్ డబుల్ హీరోగా తీసిన డాన్ ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. హిందీ చలనచిత్ర రంగంలో మైలురాయిగా నిలిచింది. గత 11 సంవత్సరాలుగా ఆయన ఊపిరితిత్తుల సంబంధిత ఫైబ్రోసిస్‌తో బాధపడుతున్నారు. ఆదివారం గుండెపోటుతో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక్కడి గురునానక్ ఆసుపత్రిలో ఆయన చాలా కాలంగా చికిత్స పొందుతున్నారు. డాన్‌కు ముందు ఆయన కొన్ని ప్రముఖ చిత్రాలకు సహాయ దర్శకులుగా పనిచేశారు. మనోజ్‌కుమార్ పూరబ్ ఔర్ పశ్చిమ్ , రోటీ కపడా ఔర్ మకాన్ , షోర్ , యాద్గార్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రతిభకు పదును పెట్టారు.

బెంగాలీ సినిమా ఆశ్రితకు కూడా దర్శకత్వం వహించారు. సలీం జావెద్ కథ స్క్రీన్‌ప్లేతో 1978లో వచ్చిన డాన్ సినిమా భారతీయ సినిమాకు విశిష్ట షాన్‌ను ఆపాదించింది. చంద్ర బారోత్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తనకు మరో వ్యక్తిగత విషాదం అని హీరో అమితాబ్ బచ్చన్ తెలిపారు. కొందరు సెలవు అంటూ వెళ్లిపోతున్నారు. చంద్ర తన డైరెక్టర్ అని స్పందించారు. ఆయన లోటును తాను తెలియచేయడం కష్టమని తమ బ్లాగ్‌లో ఆవేదన వ్యక్తం చేస్తూ తాను డాన్ అయ్యేలా చేసిన డైరెక్టర్ చంద్ర అని కితాబు ఇచ్చారు. డాన్ సినిమా నిర్మాణ సన్నివేశాల ఫోటో జతపర్చారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News