Monday, July 21, 2025

‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. వాళ్లకు మాత్రమే అనుమతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 24వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పవన్‌ ఫ్యాన్స్‌ని ఉద్ధేశించి చిత్ర యూనిట్ ఓ ప్రకటనను విడుదల చేసింది.

‘‘మీరంతా పవన్‌కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అర్థమవుతోంది. మీ ప్రేమ, ఆదరణ మాకు కావాలి. అయితే ఒక విన్నపం. సరైన పాస్‌లు ఉన్నవాళ్లకే ఈవెంట్‌కు అనుమతి ఉంది. ప్రతీ ఒక్కరి భద్రతతో పాటు.. కార్యక్రమం సజావుగా సాగడమే ఈ నిర్ణయం వెనక ఉద్ధేశం. పాస్ లేని వాళ్లు దయచేసి చుట్టుపక్కల గుమ్మిగూడకండి’’ అని మెగా సూర్య ప్రొడక్షన్స్ విజ్ఞప్తి చేసింది.

ఇక ఈ సినిమాలో పవన్‌ సరసన హీరోగాన్‌గా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ, ఎపి సినిమాటోగ్రాఫీ మంత్రులతో పాటు, కర్ణాటక పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కూడా హాజరు అవుతున్నారు. హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో జరుగుతున్న ఈ ఈవెంట్‌కి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News