Monday, July 21, 2025

జురాల 19 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చుతోంది. జూరాల ప్రాజెక్టుకు ఎగువ జలాశయాల నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు ప్రాజెక్టు 19 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం జూరాలకు 1.15 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 1.07 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళ్తోంది. అందులో స్పిల్ వే ద్వారా 74,081 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,464 క్యూసెక్కులు వరద నీటిని వినియోగిస్తున్నారు. దీంతో పాటు ఆయకట్టుపై ఆధారపడిన నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750 క్యూసెక్కులు,

కుడి, ఎడమ కాలువలకు భీమా లిఫ్ట్‌కు 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతలకు 315 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు మొత్తం నీటిమట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుతం 317.360 మీటర్లు ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టిఎంసిలకు గాను ఇప్పుడు 7.389 టిఎంసిల నీరు నిల్వ ఉంది. కాగా, ఓ వైపు కృష్ణానదికి వరద జోరు కొనసాగుతుండగా మరోవైపు వరద జోరును తిలకించడానికి సందర్శకుల తాకిడి పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News