- Advertisement -
ఇండోనేసియా ప్రయాణికుల నౌకలో భారీ మంటలు చెలరేగిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. కొందరి జాడ తెలియడం లేదు. ఇండోనేసియాలోని నార్త్ సులావెసి ప్రాంతంలో 300 మంది ప్రయాణికులతో వెళ్లుతున్న కెఎం బార్సిలోనా విఎ నౌకలో మంటలతో ప్రయాణికులలో చాలా మంది సముద్రంలో దూకారు. తాలిసే ఐలాండ్ నుంచి మనాడో సోర్టుకు నౌక వెళ్లుతుండగా ప్రమాదం జరిగింది. మంటలలో ముగ్గురు ఆహుతి అయినట్లు గుర్తించారు. నౌక నుంచి తప్పించుకునే శక్తి లేకపోవడంతో వీరిని మంటలు కబళించాయి. మొత్తం మీద 260 మందిని రక్షించినట్లు, సురక్షిత ప్రాంతాలకు పంపించినట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -