మన తెలంగాణ/హైదరాబాద్: పదవీకాలం ముగిసి న గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు స్థానిక సం స్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు సమాయ త్తం అవుతుండగా, మరోవైపు రిజర్వేషన్లు పెంచుకు నే వెసులుబాటు కల్పించే ఆర్డినెన్‌కు గవర్నర్ నుంచి ఆమోదం లభిస్తుందా? లభించని పక్షంలో ఏ విధం గా ముందుకు వెళ్లాలనే అనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్ర పరిధిలోని అంశం పై అయితే ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలపడం లాంఛనప్రాయమే. కానీ రిజర్వేషన్ల పెంపు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయం. పైగా ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇ చ్చిన తీర్పులకు లోబడి ఉండాలి. మరోవైపు రాష్ట్రం లో బీసీలకు విద్యా, ఉద్యోగాలలో 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపిన విషయం తె లిసిందే. ఇటు గవర్నర్ ఆమోదానికి పంపించిన ఆర్డినెన్స్, రాష్ట్రపతికి పంపించిన బిల్లు రెండూ వేర్వేరు అయినప్పటికీ, ఈ రెండింటికి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది.
ఇదే కారణంగా రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగా దానితో ముడిపడి ఉన్న ఆర్డినెన్స్‌ను ఆమోదించే అధికారం తనకు ఉందా? లేదా? తెలియజేయాల్సిందిగా గవర్నర్ జి ష్ణుదేవ్ వర్మ న్యాయసలహా కోరారు. వారి సలహా మేరకే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని రాజ్‌భవన్ వర్గాల సమాచారం. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వం పరిధికి సంబంధించిందే కాకుండా ఈ అంశం రాజ్యాంగ సవరణతో కూడుకున్నది . ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే గతంలో ఒక సందర్భంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గమనార్హం. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచే అం శం కేంద్ర ప్రభుత్వ పరిధికి సంబంధించింది కావడంతో తమ ప్రతిపాదనకు కేం ద్రం ఆమోదం తెలపని పక్షంలో, తాము ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడి పార్టీ పరంగా బీసీలకు 42శాతం అవకాశం కల్పిస్తామని
వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా గత బీఆర్‌ఎ స్ ప్రభుత్వం చట్టసవరణ చేసి సీలింగ్ విధించింది. ఆ సీలింగ్ ఎత్తివేసేందుకు చట్టసవరణకు అవకాశం కల్పించే విధంగా రూపొందించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలపని పక్షంలో గత ప్రభుత్వంలో ఖరారు చేసిన రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించడమా? లేక మరేదైనా ప్రత్యామ్నాయం ఉందా? అనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతుంది. దీంతో ఈ ఆర్డినెన్స్ పై గవర్నర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందనేది ఇటు అధికారం పక్షంలోనే కాకుండా ప్రతిపక్ష పార్టీలలో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ తాము కోరుకున్న విధంగా ఈ ఆర్డినెన్స్ ముసాయిదాకు గవర్నర్ ఆమోదం లభిస్తే వెంటనే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదించినా, ఆమోదించకపోయినా హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెలాఖరుకల్లా పంచాయతీ ఎన్నికలు నిర్వహించక తప్పదు.
ముందు పంచాయతీనా? ఎంపిటిసి, జడ్పీటిసినా?
రిజర్వేషన్లపై స్పష్టత రాకపోవడంతో ఏడాదిన్నరగా గ్రామపంచాయతీలు, ఏడాది కాలంగా జిల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఆర్డినెన్స్‌కు ఆమోదం లభిస్తే పంచాయతీలకు,మండల, జిల్లా పరిషత్‌లకు, రిజర్వేషన్లు ఖరారైతే బీసీలకు 42 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7 శాతంతో పాటు వీటిలోమహిళలకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. గతంలో కూడా ఇదే విధంగా జరగడంతో దీంట్లో మార్పునకు అవకాశం లేకపోవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జిల్లా పరిషత్ ఛైర్మన్‌లకు రాష్ట్రం యూనిట్‌గా, జడ్పీటీసీ, ఎంపీపీలకు జిల్లా యూనిట్‌గా, సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్‌గా, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు గ్రామం యూనిట్‌గా నిర్ణయించి రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చిందని ఆ దిశగానే ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తోన్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికార వర్గాల సమాచారం.