Monday, July 21, 2025

వర్షాకాలం వాడీవేడి

- Advertisement -
- Advertisement -

ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు కేంద్రం
సంసిద్ధత పహల్గాం ఉగ్రదాడి,
ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనలు,
బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ
తదితర అంశాలు లేవనెత్తాలని
విపక్షాల నిర్ణయం జస్టిస్ వర్మ
ఉద్వాసనకు కీలక తీర్మానం
ఎయిర్ ఇండియా విమాన
దుర్ఘటన ప్రస్తావన అఖిలపక్షం
భేటీలో వివిధ అంశాలపై చర్చ

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి (సోమవారం) నుంచి విపక్షాల ఉరుములు మెరుపుల నడుమ ఆరంభం కానున్నాయి. దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను తీసుకుని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడనున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌దే ప్రధాన పా త్ర కానుంది. అయితే ఈసారి ఇండియా కూటమి సంఘటితంగా లేకపోవడం కొట్టొచ్చే పరిణామం అయింది. పహ ల్గాం ఉగ్రదాడి, తరువాతి ఆపరేషన్ సిందూర్ వంటి వాటిపై ప్రధాని మోడీ నుంచి ప్రకటనలకు ప్రతిపక్షాలు పట్టుపట్టనున్నాయి. ఇక తానే యుద్ధం ఆపించానని ట్రంప్ పదేపదే చెప్ప డం, దేశ ఆంతరంగిక విషయాలలో ప్రమేయం అయిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని , ఇంతకు అమెరికా పట్ల ఎటువంటి వైఖరి ఉందనేది తెలియచేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చే యనున్నాయి. ఇక అన్నింటికి మించి జాతీయ స్థాయిలో బీ హార్‌లో ఇప్పుడు ఎన్నికల సంఘం ద్వారా సాగుతోన్న ప్రత్యేక ఓటర్ల జాబితా విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్) అవసరం ఏమిటని, ఇది బిజెపి అనుకూల ప్రక్రియ అని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. నెలరోజుల పాటు వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. కొన్ని కీలక బిల్లులను ఈ నేపధ్యంలో సభలలో ప్రవేశపెట్టి, ఆమోదింపచేసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశం కూడా పార్లమెంట్‌లో ప్రస్తావనకు రానుంది.

ఆపరేషన్ సిందూర్‌పై రక్షణ మంత్రి ప్రకటన
సెషన్ ఆరంభంలోనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్ పూర్వాపరాలను సభలో ప్రస్తావిస్తారు. పహల్గామ్ దాడికి జవాబుగా సైనిక బలగాలు చేపట్టిన చర్య గురించి సభలకు తెలియచేస్తారు. పూర్తి వివరాల క్రోడీకరణకు ఇప్పటికే రక్షణ మంత్రి సైనిక ఉన్నతాధికారులతో, తమ మంత్రివర్గ సహచరులతో సమీక్షించారు.

మొక్కుబడిగా సాగిన అఖిలపక్ష సమావేశం
ఈ సారి సెషన్ సజావుగా జరిగేలా అంతా సహకరించాలని ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు పలు కీలక విషయాలను సభలో ప్రస్తావించాల్సి ఉందని కోరాయి. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం, ఇప్పటికీ అంతుచిక్కని కారణాలు , మురికివాడల నిర్మూలన వంటి అంశాలను తాము సభల్లో ప్రస్తావిస్తామని ప్రతిపక్షాలు తెలిపాయి. బిజెపి పాలిత ఒడిషాలో దిగజారుతోన్న శాంతి భద్రతలు, పోలీసు జులుం, అక్కడ ఓ బిఇడి విద్యార్థిని కాలేజీ ఆవరణలో ఆత్మాహుతికి పాల్పడటం గురించి కూడా సభలో ప్రస్తావించాల్సి ఉందని ప్రతిపక్షాలు తెలిపాయి. దీనికి ప్రతిగా బిజెపి వర్గాలు బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేని స్థితిని, ప్రత్యేకించి విద్యాసంస్థలలో అత్యాచారాల ఘటనలను లేవనెత్తినట్లు వెల్లడైంది. మొత్తం మీద ఈ సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందని , ఆ తరువాత మీడియాకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజూ తెలిపారు. పార్టీల పరంగా వేర్వేరు సిద్ధాంతాలు , వైఖరిలు ఉండవచ్చు. అయితే పార్లమెంట్ నిర్వహణలో కలిసికట్టుగా వ్యవహరించడం, బాధ్యతాయుత పార్లమెంటెరియన్లుగా ఉండటం కీలక అంశం అని మంత్రి సూచించారు. సభల్లో సముచిత సమన్వయం ఉంటుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.

సభా నిబంధనలు , సాంప్రదాయం ప్రకారం అన్ని విషయాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. 51 పార్టీలకు చెందిన 44 మంది అఖిలపక్షంలో పాల్గొన్నారు. వీరిలో 40 మంది మాట్లాడారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు ప్రతీపాదన తీర్మానం , కొన్ని బిల్లులు ఉంటాయని ప్రతిపక్షాలకు ప్రభుత్వం తెలిపింది. బీహార్‌లో ఇప్పుడు బిజెపి లాభం కోసం ఎన్నికల సంఘం ద్వారా ఎలక్షన్ స్కామ్ జరుగుతోందని, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఇదే అని ఆప్ సభ్యుడు సంజయ్ సింగ్ విమర్శించారు. ఈ వాదనను జెడియు ఎంపి సంజయ్ ఝా తోసిపుచ్చారు. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు తీర్మానం కూడా ఈసారి సెషన్‌లో చర్చకు రానుంది. దీనికి ఇప్పటికే ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి.దీనితో అసాధారణ రీతిలో ఓ న్యాయమూర్తిపై పార్లమెంట్ ద్వారా అభిశంసన తరువాత పదవి నుంచి తొలిగింపు ప్రక్రియకు రంగం సిద్ధం కానుంది. న్యాయవ్యవస్థలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని విపక్షాలు తెలిపాయి. పలు పార్లమెంటరీ ప్రతినిది బృందాలు ఆపరేషన్ సిందూర్ తరువాతి దశలో కొన్ని దేశాలకు వెళ్లడం , పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడం కోసం చేసిన యత్నాలు గురించి సభలలో ప్రస్తావించాలని అధికార ఎన్‌డిఎ సభ్యులు పట్టుబడుతున్నారు.

తొలిరోజుకోసం ఖరారయిన అజెండా
ఇన్‌కంటాక్స్ బిల్లు 2025పై సెలెక్ట్ కమిటీ నివేదికను మొదటి రోజు సభలో ప్రవేశపెడుతారు. గోవాలో ఎస్‌టి అసెంబ్లీ స్థానాల సర్దుబాటుకు సంబంధించిన గోవా బిల్లు కూడా ప్రవేశపెడుతారు. రాజ్యాసభలో ది బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్లు ప్రస్తావనకు వస్తుంది. క్వశ్చన్ అవర్‌లో ఎంపిలు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనను ప్రస్తావించేందుకు వీలు కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News