Monday, July 21, 2025

సర్వేకు సాంకేతిక గ్రహణం

- Advertisement -
- Advertisement -

గ్రామాల్లో టెక్నికల్ సమస్యలతో ఇబ్బందిపడుతున్న కార్యదర్శులు
60 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు అపసోపాలు
లబ్ధిదారుల్లో అవగాహన కొరవడడం మరో సమస్య తొలి విడతలో
అక్రమాల గుర్తింపు, పునఃసర్వే ఆదేశాలతో మళ్లీ గ్రామాలబాట
పడుతున్న అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే నత్తనడకన సాగుతోంది. మున్సిపాలిటీల్లో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండగా కొంత ఆలస్యమవుతోంది. అయితే వీలైనంత త్వరగా సర్వే పూర్తి చే సి లబ్ధిదారులు ఎంత మంది ఉన్నారనే విషయాలను సేకరించి, ప్రభుత్వానికి నివేదించేందుకు అధికారు లు సన్నద్ధమవుతున్నారు. సర్వేకు వచ్చిన సిబ్బందికి దరఖాస్తుదారులు సంబంధిత ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచి, అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానం చెబితే సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తవుతుందని, ఇందుకు దరఖాస్తుదారులు సహకరించాల ని అధికారులు సూచిస్తున్నారు. సిబ్బందికి సహక రించి సరైన వివరాలు అందిస్తే సర్వే ప్రక్రియ త్వర గా పూర్తికావడంతోపాటు వివరాలను ఆన్‌లైన్‌లో న మోదు చేసేందుకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. త్వరితగతిన సర్వే పూర్తి చేసి మొదటి దశ లో అత్యంత పేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇ ళ్లను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

సర్వే అనంతరం జాబితాను ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో గల ఇందిరమ్మ కమిటీలకు అం దించనున్నారు. కమిటీ సభ్యులు ఆయా జాబితాలో ఉన్న వారి పేర్లను పరిశీలించి అర్హులా, కాదా అనే విషయాన్ని నిర్ధారించిన తరువాత అర్హులకు ఇళ్లను మంజూరు చేయనున్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్లు పథకం’ అమలు చేస్తోంది. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు కూడా ఈ పథకానికి అర్హులే. నియోజకవర్గానికి 3,500చొప్పున తొలి విడతలో 4,16,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పూరిగుడిసెలు, తాత్కాలిక ఇళ్లలో ఉంటున్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సొంత స్థలం ఉన్నవారికి తొలి దశలో ప్రాధాన్యం ఇస్తున్నారు.

యాప్ ద్వారా పనుల పురోగతి
ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా పనుల పురోగతిని అప్‌డేట్ చేస్తుండగా ఏఐ సాంకేతికతో అక్రమాలను గుర్తించి, చర్యలు తీసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సర్వే మరోసారి చేయాలన్న తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో పంచాయతీ కార్యదర్శు లు మరోసారి గ్రామాల బాట పడుతున్నారు. ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సాయంలో కేంద్రం వాటా కూడా ఉంది. దీంతో కేంద్రం ఎన్ని ఇళ్లు మంజూరు చేసింది. ఎవరికి ఇచ్చారనే వివరాల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్లస్ యాప్‌లో మరోసారి వివరాలు నమోదు చేస్తున్నారు. లబ్ధిదారు ముఖచిత్రంతో యాప్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉండడంతో పలు గ్రామాల్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని కార్యదర్శులు అంటున్నారు. ఇళ్లకు వెళ్లిన టైంలో లబ్ధిదారులు అందుబాటులో ఉండాలి. వారు లేకుంటే మరోసారి వెళ్లాల్సి వస్తోందని కార్యదర్శులు వాపోతున్నారు.
దాదాపు అరవై ప్రశ్నలకు సమాధానాలు : కార్యదర్శి ప్రధానమంత్రి ఆవాస్ ప్లస్ యాప్‌లో లాగిన్ అయ్యాక లబ్ధిదారు సమగ్ర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్, పేరు, బ్యాంకు ఖాతా, కుటుంబ సభ్యులు, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం ఇలా దాదాపు అరవై ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని నమోదు చేసి క్రోడీకరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ఆలస్యం అవుతోంది. పాత సెల్‌ఫోన్‌లో యాప్ సరిగా పని చేయకపోవడం, లబ్ధిదారు ముఖ చిత్రం, బయోమెట్రిక్ మిస్ మ్యాచ్ కావడం, ఆధార్ కార్డుకు సరిగా మ్యాచ్ కాకపోవడం, ఆధార్ కార్డు అప్‌డేట్ లేనివాటిని సరిగా ఆమోదించకపోవడం, మ్యాపింగ్ కాకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయని కార్యదర్శులు వాపోతున్నారు.
స్థలాలు ఉన్న వారికి రెండో విడతలో
ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం ఉండి ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ పథకం రెండో విడతలో ఎంపిక చేయనున్నారు. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం అందజేస్తారు. బేస్మెంట్ మొదలు కొని స్లాబ్, తదితర పనులను బట్టి నిర్ణయించిన నగదును విడుతల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న వారు ప్రభుత్వం అందజేసే రూ.5 లక్షలకు మరింత సొమ్మును కలిపి ఇళ్లును తమ ఆలోచనా విధానాలకు అనుగుణంగా నిర్మించుకునేందుకు వెసులుబాటు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. పేదవాడికి సొంతింటి కలను సాకారం చేసేందుకు నడుం బిగించింది. ఈ పథకం అమలు చేసిన దగ్గరి నుంచి రోజుకో వార్త బయటకు వస్తుంది. ఇప్పుడు తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేపట్టే గృహ నిర్మాణంలో ప్రభుత్వం నిర్ణయించిన విస్తీర్ణం మించితే అనర్హుల కిందే గుర్తిస్తున్నారు. కొందరు అవగాహన లోపంతో ఉన్నంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టి, ఇప్పుడు విషయం తెలిసి నిరాశ చెందుతున్నారు.
అవగాహన కల్పించకపోవడంతో సమస్యలు
లబ్ధిదారులకు ఇంటి నిర్మాణంపై అవగాహన కల్పించకపోవడంతో సమస్య ఎదురవుతోందని, ఇలా నిర్మించిన వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సొంత ఇంటి స్థలం కలిగి ఉన్న పేదవారు 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో వారికి ఇష్టమొచ్చినట్లు ఇల్లు నిర్మించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారులకు పలు విడతల్లో రూ.5 లక్షల సాయం అందించనున్నట్లు పేర్కొంది. అయితే కొందరు మాత్రం 600 చదరపు అడుగులకు మించి నిర్మాణం చేపట్టారు. దీంతో వీరికి మొదటి విడతగా పునాది స్థాయిలో చెల్లించే రూ.లక్ష నిలిపివేస్తున్నారు. 600 చదరపు అడుగుల స్థలం మించి నిర్మాణం చేపట్టిన వారు పేదలు కాదని, వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తించదని చెల్లింపులను నిలిపివేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందగా సొంత స్థలం ఉందనే నిర్మాణం చేపట్టామని, తాము ధనికులం కాదని వాపోతున్నారు. అవగాహన లేక తప్పిదం చేశామని, నిబంధనలు తెలిసి ఉంటే నిర్ణీత స్థలంలోనే ఇంటి నిర్మాణం చేపట్టే వారమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News