- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: కంటోన్మెంట్ ఎంఎల్‌ఎ శ్రీగణేష్‌పై పలువురు దుండగులు యత్నించారు. ఉస్మాని యా యూనివర్సిటీ పోలీసుస్టేషన్ పరిధిలోని మాణికేశ్వర్‌నగర్‌లో ఆదివా రం రాత్రి ఫలహారం బండి ఊరేగింపు సందర్భంగా ఘటన చోటుచేసుకుం ది. ఎంఎల్‌ఎ వాహనంపై 20మంది దాడికి యత్నించడమే కాకుండా గన్ మెన్ల వద్ద గన్‌లు లాక్కునేందుకు ప్ర యత్నించారని తెలిసింది. ఈ ఘటన పై ఎంఎల్‌ఎ శ్రీగణేష్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. గన్‌మెన్ల వద్ద గన్‌లు లా క్కునేందుకు దుండగులు యత్నించార ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దా డికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరో వైపు దాడికి పాల్పడిన దుండగుల గాలింపు కోసం ప్రత్యే క బృందాలు రంగంలోకి దిగాయి. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.
- Advertisement -