Monday, July 21, 2025

గంజాయికి బానిసై.. రూ.20 కోసం అమ్మనే గొడ్డలితో నరికి చంపాడు..

- Advertisement -
- Advertisement -

నుహ్(హర్యానా): గంజాయికి బానిసైన ఓ వ్యక్తి.. రూ.20 కోసం కన్న తల్లినే దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన హర్యానాలోని నుహ్ జిల్లాలోని జైసింగ్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. రూ.20 ఇవ్వడానికి నిరాకరించడంతో 56 ఏళ్ల మహిళను ఆమె కొడుకు నరికి చంపాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపి వివరాల ప్రకారం.. కొడుకు మాదకద్రవ్యాలకు బానిసై చాలా కాలంగా గంజాయి, నల్లమందు సేవిస్తున్నాడు. ఈ క్రమంలో నిందితుడు జంషెడ్ తన తల్లి రజియాను రూ.20 అడగగా.. ఆమె డబ్బు ఇవ్వడానికి నిరాకరించింది. దీనితో ఆగ్రహించిన అతను తన తల్లిని గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తల్లి చనిపోయిన తర్వాత జంషెడ్ మృతదేహం ఉన్న ఇంట్లోనే రాత్రంతా గడిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం రజియా మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. నాలుగు నెలల క్రితమే రజియా భర్త ముబారక్ మరణించాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News