Tuesday, July 22, 2025

ఫ్యాన్స్కు రామ్ చరణ్ సర్ప్రైజ్.. ఫోటో వైరల్

- Advertisement -
- Advertisement -

తన అభిమానులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం చరణ్, ఉప్పెన ఫేం డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రామ్ చరణ్ రా అండ్ రస్టిక్ లుక్ లో పొడువైన జట్టు, గడ్డంతో ఊర మాస్ గా కనిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి రెండు షెడ్యూల్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు చరణ్. ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నాడు. తాజాగా ట్రైనింగ్ సమయంలో దిగిన ఫోటోను రామ్‌ చరణ్‌ అభిమానులతో పంచుకున్నాడు. దీంతో నిమిషాల్లో ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటోపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ..అరాచకం, బెస్ట్ బీస్ట్ లుక్, అసలు ఏం ప్లాన్ చేస్తున్నావ్ తలా #బుచ్చిబాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతి బాబు తదితర ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. గేమ్ ఛేంజర్ ప్లాప్ కావడంతో ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News