- Advertisement -
ప్రతి రాత్రి
చంద్రుడు చుక్కలు
సముద్రుడి హృదయంపై
స్నానానికి వస్తాయి.
అతనితో కలిసి
కలలు కనడానికి
చల్ల గాలి, చేపలు, నత్తలు ఉవ్విల్లురుతాయి.
ఓడలు, పడవలు
అతని హృదయాన్ని
రంగులతో నింపేస్తాయి.
తన హృదయంలోకి అడుగుపెట్టకుండా
సముద్ర తీరం మీద
నత్తలేరుకునే అమ్మాయితో
అతడు ప్రేమలో పడతాడు.
అందుకే సముద్రుడు నిద్ర పోలేడు
అందుకే అతనికి నిద్ర రాదు
- అస్సామీ మూలం: నీలీమ్ కుమార్
ఆంగ్లం: దిబ్యజ్యోతి శర్మ
తెలుగు: రమేశ్ కార్తీక్ నాయక్
- Advertisement -