- Advertisement -
మహానగరంలో మహంకాళికి బోనాలు
ఇంటింటా బోనమెత్తిన భాగ్యనగరం
డప్పులతో దరువులు, దండిగా పూజలు
సికింద్రాబాద్‌లో శివసత్తుల ఆట పాటలు
పసుపు కుంకుమతో తల్లికి పూజలు
గ్రామ గ్రామాన ఘనంగా బోనాలు
సాక పెట్టి, సంతోషంగా ఉండాలని
పోతరాజుల కొరడాలు
తీన్మార్ దరువుల గానాలు
మొక్కే భక్తులు, బైండ్లల్ల ఆటపాటలు
పల్లె పల్లెనా, పట్నాలు ఏకమై
సబ్బండ వర్గాలు జరుపుకునే
సంబరాల పండుగ మహంకాళి బోనాలు
ఎల్లలోకాలను సల్లంగా చూడమని
బోనమెత్తె మముగన్న మా తల్లి తెలంగాణ
- దేవులపల్లి రమేశ్
- Advertisement -