టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబి 29’. ఈ సినిమా కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా షూటింగ్ నెకస్ట్ షెడ్యూల్ కెన్యాలో ప్లాన్ చేశారు మేకర్స్. కానీ, అక్కడ నెలకొన్న కఠిన పరిస్థితుల కారణంగా ఈ చిత్రాన్ని అక్కడ షూటింగ్ చేయలేకపోతున్నారు. దీంతో ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ చిత్ర షూటింగ్ కోసం కొత్త లొకేషన్‌ను ఎంపిక చేశారు.
టాంజానియాలోని కొన్ని సుందరమైన ప్రదేశాలలో ఈ షూటింగ్ నిర్వహించేందుకు మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో (budget Rs. 1000 crore) రూపొందిస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమాను శిఖరాగ్రాన నిలబెట్టిన రాజమౌళి, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో దానిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. ఈ సినిమాలు భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పాయి. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి సినిమాల కోసం ఎదురుచూసే అభిమానుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సినిమా భారతీయ సిని చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.