Tuesday, July 22, 2025

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం.. ప్రతిపక్షాల ఆందోళనలతో వాయిదా

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్సభలో గందరగోళం నెలకొంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్పై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాయి. ప్రశ్నోత్తరాల తర్వాత ఆపరేషన్ సిందూర్పై చర్చిద్దామని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ప్రశ్నోత్తరాల తర్వాత నోటీస్ ఇవ్వాలని ప్రతిపక్షాలకు స్పీకర్ సూచించారు.. అన్ని అంశాలపై చర్చిద్దామని ఆయన సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా, విపక్షాలు ఆందోళనలు విరమించుకోకపోవడంతో స్పీకర్‌ లోక్‌సభను వాయిదా వేశారు.

కాగా..  పార్లమెంట్‌ సమావేశాలు సందర్భంగా మొత్తం 7 పెండింగ్ బిల్లులతో పాటు మరో 8 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఈరోజు నుంచి ఆగస్ట్‌ 21 వరకు నెల రోజుల పాటు వర్షకాల సమావేశాలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News