Tuesday, July 22, 2025

‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఏం జరిగినా నిర్మాతదే బాధ్యత: పోలీసులు

- Advertisement -
- Advertisement -

‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హైదరాబాద్ పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు‘ ప్రీరిలిజ్ ఈవెంట్ జరగనుంది. దీనికోసం మేకర్స్ అనుమతి కోరగా.. పలు కండీషన్స్ తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పోలీసులు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 1000 నుంచి 1500 మంది అభిమానులకు మాత్రమే అనుమతిచ్చినట్లు తెలుస్తోంది. ఈవెంట్ బయట క్రౌడ్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోవాలని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నిర్మాతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసులు తేల్చి చెప్పినట్లు సమాచారం. పుష్ప సినిమా ఘటన నేపథ్యంలో సినీ కార్యక్రమాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కాగా, ‘హరిహర వీరమల్లు’ మూవీ ఈనెల 24 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News