హైదరాబాద్: బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో (Betting Apps Case) విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) విచారణను ముమ్మరం చేసింది. ఈ మేరకు పలువురు సెలబ్రిటీలకు ఇడి నోటీసులు జారీ పంపించింది. హీరో రానా దగ్గుబాటికి జూలై 23న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. రానాతో పాటు జూలై 30న ప్రకాశ్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13వ తేదీన మంచు లక్ష్మిలను విచారణకు రావాలంటూ ఆదేశించింది.
కాగా, బెట్టింగ్ యాప్ కేసులో (Betting Apps Case) ఇడి ఇప్పటివరకూ దాదాపు 25 మందిని విచారించింది. వీరిలో రానా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మితో పాటు, హీరోయిన్లు ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, యాంకర్ శ్రీముఖి తదితరులు ఉన్నారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ కోసం వీళ్లు భారీగా డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లావాదేవీల గురించే విచారణలో ఇడి ఆరా తీస్తుంది.