అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య భర్తను చంపి టైల్స్ కింద పాతిపెట్టిన ఘటన మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం… పాల్గర్ జిల్లాకు చెందిన విజయ్ చవాన్ (35), భార్య కోమల్(28) తో కలిసి ఉంటున్నాడు. ఇతను నలసోపెరా ఈస్ట్ లోని గడ్గపడాలో నివాసం ఉంటుండుగా గత 15 రోజులుగా కనిపించకుండా పోయాడు. విజయ్ కోసం కుటుంబ సభ్యులు బంధువుల ఊర్లో, చుట్టు ప్రక్కల గ్రామాలలో వెతుకుతూ ఉన్నారు. సోమవారం జులై 21న విజయ్ తమ్ముడు విజయ్ ఇంటికి వెళ్లాడు.
ఇంట్లోని ఫ్లోర్ టైల్స్ లలో రెండు కొంచెం తేడాగా కనిపించడంతో అనుమానంతో టైల్స్ ను తొలగించి చూశాడు. టైల్స్ కింద దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి చూడగా టైల్స్ కింద మృతదేహాం బయట పడింది. దీంతో పోలీసులు విజయ్ ను భార్యే హత్య చేసి పాతిపెట్టినట్లు నిర్థారించారు. కాగా రెండు రోజుల క్రితమే విజయ్ భార్య కోమలో ఓ యువకుడితో పారిపోయింది. కోమల్ కు యువకుడి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వెతకటం ప్రారంభించారు.