Tuesday, July 22, 2025

పరుపులోకి దూరిన కొండచిలువ..ఎక్కడంటే

- Advertisement -
- Advertisement -

నిద్రిస్తున్న యువకుడి పరుపులోకి కొండ చిలువ దూరిన ఘటన పెబ్బేరు పట్టణంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. పెళ్లూరు చిన్నకేశవులు ఆదివారం రాత్రి ఇంటి వరండాలో పరుపు వేసుకొని పడుకున్నాడు. కుక్కలు అరవడంతో సోమవారం తెల్లవారుజామున నిద్ర లేవగా పరుపులో ఎదో కదులుతున్నట్లు గమనించాడు. పరుపులో కొండ చిలువ ఉండటంతో భయాందోళనకు గురై అరిచాడు. దీంతో చుట్టు పక్కల వాళ్లు వచ్చి చూసే సరికి కొండ చిలువ మెట్ల కిందికి వెళ్లింది. స్థానికుల సమాచారం మేరకు పాములను పట్టే యువకుడు వచ్చి కొండచిలువను బంధించి పెద్దగూడెంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. పట్టుబడిన కొండ చిలువ 7 ఫీట్ల పొడువు, 15 కిలోల బరువు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News