Tuesday, July 22, 2025

ఆ 12 మంది నిర్ధోషులే..

- Advertisement -
- Advertisement -

గతంలో నిందితుల్లో ఐదుగురికి ఉరి, మిగతా
వారికి జీవిత ఖైదు శిక్ష విధించిన ట్రయల్ కోర్టు
ట్రయల్ కోర్టు తీర్పును పక్కన పెట్టిన హైకోర్టు
నిందితులే పేలుళ్లకు కారణమని
నిరూపించడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా
విఫలమైందన్న ధర్మాసనం నాటి దుర్ఘటనలో
189 మంది మృతి.. 800 మందికి గాయాలు

ముంబై: ముంబైలో 2006లో రైలు పేలుళ్లలో 189 మంది మర ణం, 800 మందికి గాయపడిన కేసులో 19 ఏళ్ల తర్వాత బాంబే హైకోర్టు సోమవారం నాడు తీర్పు ప్రకటించింది. సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో దిగువకోర్టు దోషులుగా నిర్థారించిన 12 మందిని హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2006 జూలై 11న ముంబై లోకల్ ట్రైన్‌లలో 11 నిముషాల వ్యవధిలో వేర్వేరుగా జరిగిన పేలుళ్లలో 189 మంది మరణించారు. 800 మందికి పైగా గాయపడ్డారు. 2015లో, ట్రయల్ కోర్టు 12 మంది నిందితులను దోషులుగా తేల్చి, వారిలో ఐదుగురికి మరణశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. కాగా, సోమవారం నాడు బాంబే హైకోర్టు ట్రయిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టింది. ఈ నిందితులే పేలుళ్లకు పాల్పడ్డారని కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైందని జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది.

నిందితులు నేరం చేశారని పూర్తిగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని. అందువల్లే ట్రయిల్ కోర్టు చేసిన దోష నిర్థారణ రద్దుచేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. నిందితులు మరో ఇతర కేసులలో దోషులు కానిపక్షంలో వారిని జైలునుంచి విడుదల చేయాలని కోర్టు వెల్లడించింది. నేరాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయినందువల్ల నిందితులకు -బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద విముక్తి ప్రసాదించినట్లు న్యాయమూర్తులు ప్రకటించారు. పేలుళ్లు జరిగిన 100 రోజుల తర్వాత ఒక వ్యక్తి అనుమానితుడిని గుర్తుంచుకోవడం అసాధ్యమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. దర్యాప్తు సమయంలో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మ్యూప్‌లకు పేలుళ్లకు సంబంధం లేనివిగా కన్పించాయని కోర్టు పేర్కొంది. పేలుళ్లలో ఎలాంటి బాంబులను ఉపయోగించారో కూడా ప్రాసిక్యూషన్ నిరూపించలేక పో యిందని పేర్కొన్నది. 2006 జూలై 11న సాయంత్రం ఉద్యోగులు విధులనుంచి వస్తున్న లోకల్ రైళ్లలో కేవలం 11 నిముషాల వ్యవధిలో 11 బాంబులు పేలాయి.

మొదటి బాంబు సాయంత్రం 6.24 నిముషాలకు, చివరి బాంబు 6.35 నిముషాలకు పేలింది. మాతుం గా రోడ్, మహీమ్ జంక్షన్, బంద్రా, ఖార్ రోడ్, జోగేశ్వరి, భయాందర్, బోరివల్లి స్టేషన్ల సమీపంలో పేలాయి. చర్చ్ గేట్ నుంచి వచ్చే రైళ్లలోని ఫస్ట్ -క్లాస్ కంపార్ట్ మెంట్లలో బాంబులను ఉంచారు. ప్రెషర్ కుక్కర్లను బాంబు పేలుళ్లకు ఉపయోగించారు. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్జ్ క్రైమ్ యాక్ట్ కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు 12 మంది నిందితులకు 2015 లో శిక్ష ఖరారు చేసింది. ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి జీవిత ఖైదు విధించగా హైకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పువల్ల మొత్తం 12 మంది ఇప్పుడు విడుదల కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News