- Advertisement -
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం నారాసింహునిపేట పాఠశాలలోని తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినిల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు ఈ నెల 18న శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. గతంలో కూడా శ్రీనివాసరావు బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -