Wednesday, July 23, 2025

షార్ట్ సర్క్యూట్ తో మూడు దుకాణాలు దగ్థం

- Advertisement -
- Advertisement -

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మూడు దుకాణాలు దగ్థమైయిన సంఘటన మెదక్ పట్టణంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అర్థరాత్రి రెండు గంటల సమయంలో స్థానికులు షాపుల్లోంచి మంటలు రావడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే షాపులు పూర్తిగా కాలిపోయాయి. అనంతరం పోలీసులు షాపుల యజమానులకు సమాచారం అందించారు.పోలీసుల సమాచారం మేరకు షాపుల వద్దకు వచ్చిన యజమానులు షాప్స్ కాలిపోవడంతో తమ జీవనాధారం కోల్పోయామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని అధికారులను వేడుకున్నారు.షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News