- Advertisement -
రోడ్డు ప్రమాదంలో వైద్యుడు మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతిమ వైద్య కళాశాలకు చెందిన డాక్టర్ సోమవారం అర్థరాత్రి కారులో మరికొందరితో మొగ్దుంపూర్ నుండి నగనూర్ వైపు వెళ్తుండగా జూబ్లీనగర్ ఎల్లమ్మ ఆలయం మూల మలుపు వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డాక్టర్ కు తీవ్రగాయాలై ఘటన స్థలిలోనే మృతి చెందాడు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -